![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలిచే యువ కథానాయకుల్లో నిఖిల్ ఒకరు. అదే బాటలో పయనించే దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్ లో నిఖిల్ నటించిన చిత్రం `ఎక్కడికి పోతావు చిన్నవాడా`. సూపర్ నేచురల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా అవికా గోర్, హెబా పటేల్, నందితా శ్వేత కనిపించారు. ఆద్యంతం ఆసక్తికర కథనంతో, మలుపులతో సాగే ఈ చిత్రానికి ఈ నలుగురి నటన ప్రధాన బలంగా నిలిచింది. `వెన్నెల` కిశోర్, సత్య, వైవా హర్ష, రాజా రవీంద్ర, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ, అపూర్వ, పృథ్వీరాజ్, జీవా, ప్రవీణ్, ఫిష్ వెంకట్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
శేఖర్ చంద్ర బాణీలకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, ప్రసన్న బెజవాడ, శేఖర్ చంద్ర సాహిత్యమందించారు. ``నీతో ఉంటే చాలు``, ``వంద స్పీడులో``, ``మస్తుగుంది లైఫ్``, ``చిరునామా తన చిరునామా``.. ఇలా ఇందులోని గీతాలన్ని యువతరాన్ని రంజింపజేశాయి. అబ్బూరి రవి సంభాషణలు, సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం, ఛోటా కే ప్రసాద్ కూర్పు.. ఈ చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి. మేఘన ఆర్ట్స్ పతాకంపై పీవీ రావు నిర్మించిన `ఎక్కడికి పోతావు చిన్నవాడా``.. 2016 నవంబర్ 18న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం ఐదు వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |