![]() |
![]() |

'జై భీమ్' సినిమా వివాదం ముదురుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు హీరో సూర్యని కొట్టినవారికి లక్ష రూపాయలు ఇస్తామని పీఎంకే పార్టీ నేతలు సంచలన ప్రకటన.. మరోవైపు అనేకమంది సూర్యపై దాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్య నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'జై భీమ్' సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే, పీఎంకే పార్టీ నేతలు మాత్రం 'జై భీమ్'లో వన్నియార్ కమ్యూనిటీని అవమానించారంటూ సూర్య విరుచుకుపడుతున్నారు. సూర్యని కొట్టినవారికి లక్ష రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు సంచలన ప్రకటన చేశారు. మరోవైపు వన్నియార్ సంఘం తమకు రూ.5 కోట్లు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే సూర్య తమకి ఏ వర్గాన్ని అవమానించే ఉద్దేశం లేదని, కేవలం యదార్థ ఘటనల ఆధారంగా సినిమాని చేసామని చెప్పారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. సూర్యకి బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే 'జై భీమ్' వివాదంలో రోజురోజుకి సూర్యకి మద్దతు పెరుగుతోంది. సినీ అభిమానుల నుండి సినీ ప్రముఖుల వరకు సూర్య అండగా నిలుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే #WeStandWithSuriya అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. 'జై భీమ్' విషయంలో తనకి వర్గాల నుండి వస్తున్న మద్దతు పట్ల సూర్య సంతోషం వ్యక్తం చేశారు. "జైభీమ్ మూవీపై చూపిస్తున్న ప్రేమ అపారమైనది. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రేమ చూడలేదు. ఈ సమయంలో మాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు" అంటూ సూర్య ట్వీట్ చేశారు.
![]() |
![]() |