![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ స్క్రీన్ యాక్టింగ్, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ తో డార్లింగ్ గా ఎందరికో దగ్గరైన ప్రభాస్ క్రేజ్ 'బాహుబలి'తో ఆకాశాన్ని అంటింది. ప్రభాస్ పై తమ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా ఓ ఫ్యాన్ చేసిన పనికి ఫిదా అయిన ప్రభాస్.. అతనికి ఓ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
తాజాగా ప్రభాస్ ఫ్యాన్ ఒకతను తలపై 'ప్రభాస్' అని అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. తన పేరుతో హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకున్న విషయం ప్రభాస్ దృష్టికి వెళ్లి మురిసిపోయాడు. అతని అభిమానాన్ని చూసి షాక్ అయిన ప్రభాస్.. అతన్ని తన వద్దకు పిలిపించుకొని కాసేపు సరదాగా ముచ్చటించాడు. అంతేకాదు ఆ ఫ్యాన్ కి ఓ ఖరీధైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఫ్యాన్ తో ప్రభాస్ ముచ్చటించిన ఫోటోలు, వాచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్యాన్ తో అంత ఫ్రెండ్లీగా ఉండటం డార్లింగ్ కే చెందింది అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
![]() |
![]() |