![]() |
![]() |

`లెజెండ్` (2014)తో నయా ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన విలక్షణ నటుడు జగపతి బాబు.. అటు ప్రతినాయకుడి పాత్రల్లోనూ, ఇటు సహాయక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మరీముఖ్యంగా.. ఇటీవల కాలంలో వరుస చిత్రాలతో సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు జగ్గూ భాయ్. సెప్టెంబర్ ప్రథమార్ధం నుంచి నవంబర్ ప్రథమార్ధం వరకు గమనిస్తే.. `టక్ జగదీష్`, `లాభమ్`(తమిళ్), `అన్నాబెల్ సేతుపతి` (తమిళ్), `రిపబ్లిక్`, `మహా సముద్రం`, `అణ్ణాత్త` (పెద్దన్న).. ఇలా అరడజను చిత్రాలతో ఎంటర్టైన్ చేశారు జగపతి బాబు.
కట్ చేస్తే.. ఒక్క 2021 డిసెంబర్ లోనే అటు ఇటుగా అరడజను చిత్రాలతో పలకరించబోతున్నారు ఈ వెటరన్ అండ్ వెర్సటైల్ ఆర్టిస్ట్. ఆ వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 2న `అఖండ`, డిసెంబర్ 3న `మదగజ` (కన్నడ), డిసెంబర్ 10న `గుడ్ లక్ సఖి`, డిసెంబర్ 17న `పుష్ప - ద రైజ్`, డిసెంబర్ 24న `గని` చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటన్నింటిలోనూ జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అలాగే జగ్గూ భాయ్ ముఖ్య పాత్రలో నటించిన మరో తెలుగు చిత్రం `లక్ష్య` కూడా కుదిరితే నవంబర్ నెలాఖరులో లేదంటే డిసెంబర్ మాసంలో విడుదలయ్యే దిశగా ఉంది. మొత్తమ్మీద.. 2021 డిసెంబర్ మాసం.. `జగ్గూ భాయ్` మయం అన్నట్లుగా ఉందనే చెప్పాలి.
![]() |
![]() |