![]() |
![]() |

ఇదివరకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యువరాజ్ ధయాళన్ డైరెక్షన్‌లో నటించడానికి నయనతార అంగీకరించింది. యువరాజ్ గతంలో 'పొట్ట పొట్టి', 'తెనాలిరామన్', 'ఎలి' లాంటి సినిమాలను రూపొందించాడు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం యువరాజ్ ప్రస్తుతం తీస్తున్న సినిమా నుంచి నయన్ తప్పుకుంది. దీనికి కారణం కాల్షీట్ల సమస్య. అట్లీ డైరెక్ట్ చేస్తోన్న బాలీవుడ్ ఫిల్మ్ 'లయన్'తో నయన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఆ మూవీలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.
అయితే 'లయన్' మూవీ షూటింగ్‌లో జాప్యం కారణంగా, దానికి తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నయన్‌కు. మరోవైపు నయన్ లేకుండా ఇప్పటికే తన సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను యువరాజ్ చిత్రీకరించాడు. ఇప్పుడు నయన్‌తో సన్నివేశాలు తీద్దామని ప్లాన్ చేశాడు. కానీ ఆమె 'లయన్' మూవీకి డేట్స్ ఇవ్వడం వల్ల అది సాధ్యపడేలా కనిపించలేదు. దాంతో వారు నయన్ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతల్లో ఒకరైన ఎస్.ఆర్. ప్రభు నయనతార ప్లేస్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ను తీసుకున్నట్లు ధ్రువీకరించారు. మూడు జంటల కథతో ఈ సినిమా నడుస్తుందని ఆయన చెప్పారు. 'జెర్సీ', 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రాలలో చక్కని నటన ప్రదర్శించడం ద్వారా శ్రద్ధ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
![]() |
![]() |