![]() |
![]() |

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలతో అలరించే సుమంత్ నటిస్తున్న కొత్త సినిమా 'అహం రీబూట్'. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న 'అహం రీబూట్' సినిమా తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది.
'అహం రీబూట్' సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, మరో దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విభిన్నంగా డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

మూవీ లాంచ్ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ సాగర్ మాట్లాడుతూ.. సుమంత్ ఆర్జే క్యారెక్టర్ లో కనిపించనున్న 'అహం రీబూట్' సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని చెప్పారు. "అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్. ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం" అన్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్.
![]() |
![]() |