![]() |
![]() |

'కోతిమూక' ఫేమ్ శ్రద్ధా ఆర్య ప్రి వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆమె మెహందీ వేడుక జరుపుకుంది. దీనికి ఆమె స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రెండు పిక్చర్స్‌ను షేర్ చేసింది. వాటిలో ఆమె తను పెట్టుకున్న మెహందీని, ఎంగేజ్‌మెంట్ రింగ్‌నూ చూపిస్తోంది. "నేనెప్పుడూ ఇంత ఈజీగా 'యస్' చెప్పలేదు" అని దానికి క్యాప్షన్ పెట్టింది. ఢిల్లీలో నేడు ఆమె వివాహం జరగనుంది.
ఫొటోలను షేర్ చేసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఫ్రెండ్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్స్ రాసుకొచ్చారు. మౌనీ రాయ్ "కంగ్రాచ్యులేషన్స్ మై లవ్" అని రాయగా.. అంకితా లోఖండే, హిమాన్షు మల్హోత్రా, ఆర్జిత్ తనేజా లాంటి సహనటులు శుభాకాంక్షలు తెలిపారు.
.webp)
కొన్ని అనుబంధాలలో చేదు అనుభవాలను ఎదుర్కొన్న శ్రద్ధ, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఓకే చెప్పిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. "ఆమె కాబోయే భర్త రోహన్ నేవీలో వర్క్ చేస్తున్నాడు. అతని స్వస్థలం ఢిల్లీ. ఈ వేడుక చాలా సింపుల్‌గా, ఇరువురి కుటుంబ సభ్యుల మధ్యే జరుగుతోంది. శ్రద్ధ, రోహన్ ఇటీవలే కలుసుకున్నారు. ఒకరికొకరు బాగా కనెక్టయ్యారు. ఎక్కువ రోజులు ఆలస్యం చెయ్యకుండా వెంటనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడ్ చేసుకున్నారు. నవంబర్ 16న ఢిల్లీలో పెళ్లి జరుగుతోంది." అని ఆ వర్గాలు చెప్పాయి.
.webp)
గతంలో 2015లో ఒక ఎన్నారైతో శ్రద్ధకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఆ తర్వాత దాన్ని ఆమె రద్దు చేసుకుంది. అలాగే 'నాచ్ బలియే 9'లో తనతో పాటు జంటగా చేసిన ఆలమ్ మక్కర్‌తో ప్రేమలో పడిన ఆమె, అతనితోనూ తెగతెంపులు చేసుకుంది.
'గొడవ', 'కోతిమూక' లాంటి సినిమాల్లో నటించిన శ్రద్ధ తర్వాత టెలివిజన్ రంగానికి షిఫ్టయ్యింది. హిందీ సీరియల్ 'కుండలీ భాగ్య'లో చేస్తున్న హీరోయిన్ క్యారెక్టర్ ఆమెకు దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెట్టింది.
![]() |
![]() |