![]() |
![]() |

మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మామయ్య విజయకుమార్ మీనన్ ఈరోజు (నవంబర్ 15) కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ తండ్రి విజయకుమార్ దీర్ఘ కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. అంతేకాదు, గుండె జబ్బుకు గురైన ఆయనకు సర్జరీ కూడా జరిగింది.
విజయకుమార్‌కు భార్య పద్మ మీనన్ ఉన్నారు. సుప్రియ వాళ్లకు ఏకైక సంతానం. ముంబైలో పృథ్వీరాజ్‌ను తొలిసారి కలుసుకున్నప్పుడు సుప్రియ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. పృథ్వీరాజ్‌తో వివాహానంతరం కొంతకాలం కెరీర్‌ను కొనసాగించిన ఆమె, ఆ తర్వాత భర్త సొంత నిర్మాణ సంస్థ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ వ్యవహారాలను ఆమె చూసుకుంటూ వస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, కురుత్తి లాంటి పాపులర్ ఫిలిమ్స్‌కు నిర్మాత ఆమే.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'భీమ్లా నాయక్' ఒరిజినల్ అయిన మలయాళం సూపర్‌హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో కోషిగా పృథ్వీరాజ్ నటించాడు. తెలుగు రీమేక్‌లో ఆ క్యారెక్టర్‌ను రానా చేస్తున్నాడు.
![]() |
![]() |