![]() |
![]() |

ఆర్య, ఆర్య-2 సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో బన్నీతో కలిసి స్టార్ హీరోయిన్ సమంత చిందేయనుంది.
బన్నీ, సుకుమార్ కాంబో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కి క్రేజ్ ఎక్కువ. ఆర్యలో 'అ అంటే అమలాపురం', ఆర్య-2 లో 'రింగ రింగ' పెద్ద హిట్ అయ్యాయి. దీంతో 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్పలో స్పెషల్ సాంగ్ ఉందని, అందులో బాలీవుడ్ హీరోయిన్ చిందేయనుందని మొదట వార్తలొచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఊహించని విధంగా ఇప్పుడు సమంత పేరు తెరపైకి వచ్చింది. పుష్ప ఐటమ్ సాంగ్ లో సమంత సందడి చేయనుందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించిన సమంత ధన్యవాదాలు తెలుపుతూ తాజాగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇన్నేళ్ళ సమంత కెరీర్ లో ఇదే ఫస్ట్ ఐటమ్ సాంగ్ కావడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ కూడా ప్రస్తావించారు. సమంత చేస్తున్న ఫస్ట్ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ గా, మెమొరబుల్ గా మిగిలిపోనుందని పోస్టర్ పేర్కొన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న పుష్పకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న పుష్ప మూవీ మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |