![]() |
![]() |

కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'ఇండియన్ 2' (భారతీయుడు 2) మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్లేస్‌లో ఓ టాప్ హీరోయిన్ నటించనున్నది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో, ఆమె స్థానంలో ఓ పెద్ద హీరోయిన్‌ను తీసుకోవాలని శంకర్ చూస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున సినిమా నుంచి కాజల్ తప్పుకున్న విషయం తెలిసిందే. 'ఇండియన్ 2'లో ఆమె స్థానంలో ఇద్దరు టాప్ యాక్ట్రెస్‌ల పేర్లను శంకర్, నిర్మాతలు పరిశీలిస్తున్నారు. వాటిలో త్రిష పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న 'రాంగి', 'పొన్నియన్ సెల్వన్' మూవీస్‌లో త్రిష నటిస్తోంది.
కాగా కమెడియన్ వివేక్ ప్లేస్‌లో మరో కమెడియన్‌ను తీసుకోనున్నారు. వివేక్ ఇటీవల హార్ట్ ఎటాక్‌తో ఆకస్మికంగా మృతి చెందారు. అప్పటికే ఆయనపై కొన్ని సీన్లను చిత్రీకరించారు కూడా. ఇప్పుడు ఆ సీన్లను మళ్లీ తీయనున్నారు.
శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఇండియన్ 2' షూటింగ్‌ను ఆయన పునఃప్రారంభిస్తాడని సమాచారం. ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్, బాబీ సింహా, ఢిల్లీ గణేశ్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
![]() |
![]() |