![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గని'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గని గ్లింప్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా గని టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించిన అందించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
"ప్రతి ఒక్కడి కథలో కష్టాలుంటాయి, కన్నీళ్ళు ఉంటాయి" అంటూ చరణ్ వాయిస్ తో టీజర్ ప్రారంభమవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్ గా టీజర్ బాగుంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించిన విధానం ఆకట్టుకుంటోంది. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యక ఆకర్షణగా నిలిచింది. చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయిన టీజర్.. "ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటాం.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం" అంటూ చరణ్ వాయిస్ తోనే ఎండ్ అయింది. మొదటి నుంచీ తన సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ విజయాలు అందుకుంటున్న వరుణ్.. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న 'గని'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
'గని'లో వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా, నరేష్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |