![]() |
![]() |

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరపై నటిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాలతో అలరించిన ఆమె.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా ఓ వైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై సెలెక్టెడ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న ఈ భామ.. సినిమా కోసం అవసరమైతే గుండు గీయించుకోవడానికి కూడా సిద్ధమేనంటూ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమెకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'మీకు బిగ్ ఫిల్మ్ లో మంచి రోల్ వస్తే.. అవసరమైతే ఆ రోల్ కోసం గుండు కొట్టించుకుంటారా?' ఓ నెటిజన్ అడిగాడు. దానికి అనసూయ 'అవసరమైతే ఖచ్చితంగా కొట్టించుకుంటాను' అని బదులిచ్చింది. అనసూయ ఆన్సర్ తో నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే గుండు కొట్టించుకోవడానికి సిద్ధమని చెప్పడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాల విషయానికొస్తే అనసూయ నటించిన 'ఫ్లాష్ బ్యాక్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే పుష్ప మూవీలో ఆమె పోషిస్తున్న 'దాక్షాయణి' అనే పవర్ ఫుల్ రోల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
![]() |
![]() |