![]() |
![]() |

తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా నటించిన సినిమా 'అద్భుతం'. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి స్టొరీ అందించడం విశేషం. ఈ మూవీ నవంబర్ 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఒకే మొబైల్ నెంబర్ ను ఇద్దరికి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'అద్భుతం' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. 'ఇదేంటి సార్ సైన్స్ ఫిక్షన్ సినిమాలాగ ఉంది' అని హీరో తేజ సజ్జా చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. 'అ!', 'కల్కి', 'జాంబి రెడ్డి' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించిన స్టొరీ కావడం, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు.
![]() |
![]() |