![]() |
![]() |

తమిళ్ సూపర్ హిట్ మూవీ 'ఓ మై కదవులే' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు నే ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
'ఓ మై కదవులే' తెలుగు రీమేక్ కు 'ఓరి దేవుడా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గాలిలో ఎరుగుతున్న సీతాకోకచిలుకను విశ్వక్ సేన్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. మిథిలా పాల్కర్ తాడుతో విశ్వక్ ని వెనక్కి లాగుతూ ఉండటం పోస్టర్ లో కనిపిస్తుంది. డిఫరెంట్ గా, కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ మూవీపై ఆసక్తి పెరిగేలా చేసింది.
కాగా, 'ఓ మై కదవులే' తమిళ్ లో గత ఏడాది వాలెంటైన్స్ డేకి విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అశోక్ సెల్వన్, రితిక సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో.. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో దేవుడిగా కనిపించారు. తెలుగులోనూ ఆ పాత్ర విజయ్ సేతుపతినే చేయబోతున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |