![]() |
![]() |

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా క్రేజీ గానే ఉంటుంది. తన మూవీ ప్రమోషన్స్ లో కొత్తదనం ఉండేలా చూసుకునే విజయ్.. తన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'పుష్పక విమానం' కోసం మరింత వినూత్నంగా ఆలోచిస్తున్నాడు. తాజాగా హోటల్ లో బెడ్ పై పడుకొని ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్.. "నాతో బెడ్ ఎవరు షేర్ చేసుకున్నారో గెస్ చేయండి" అంటూ 'పుష్పక విమానం' మూవీ ప్రమోషన్ ను కొత్తగా చేస్తున్నాడు.
ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్పక విమానం'. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్స్ గా నటించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో చిట్టిలంక సుందర్ అనే పాత్రలో ఆనంద్ అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పెళ్లయిన కొద్ది రోజులకే పెళ్ళాం లేచిపోవడంతో సుందర్ పదే అవస్తలు ట్రైలర్ లో నవ్వు తెప్పించాయి. ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దేవరకొండ బ్రదర్స్ మూవీ ప్రమోషన్ షురూ చేశారు.

"నాతో బెడ్ ఎవరు షేర్ చేసుకున్నారో గెస్ చేయండి" అంటూ విజయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. వైజాగ్ లోని ఒక హోటల్ రూమ్ లో బెడ్ పై పడుకొని ఉన్న విజయ్.. తన పక్కన బెడ్ షీట్ కప్పుకొని పడుకొని ఉన్న ఆనంద్ ని 'సుందర్.. చిట్టిలంక సుందర్' అని పిలుస్తూ నిద్ర లేపుతాడు. ఆనంద్ బెడ్ షీట్ ఓపెన్ చేయగానే.. "నీ పెళ్ళాం ఎక్కడ సుందర్" అని విజయ్ అడుగుతాడు. మొదట ఆ ప్రశ్నకి ఇర్రిటేట్ అయిన ఆనంద్.. ఆ తర్వాత 'లేచిపోయిందిరా బై' అని సమాధానం చెప్తాడు. ఇక నవంబర్ 12న 'పుష్పక విమానం' విడుదల అవుతుందని తెలుపుతూ వీడియోను ముగించారు.
![]() |
![]() |