![]() |
![]() |

సాంగ్ షూటింగ్ మధ్యలో సెట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోను 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ షేర్ చేసింది. ఫ్యాన్స్‌కు ఈ ఫొటో కన్నుల పండుగగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. "నాటు నాటు" సాంగ్ షూటింగ్ మధ్యలో ఆ హీరోలిద్దరూ ఒకచోట కూర్చొని ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. చరణ్ తన సెల్‌ఫోన్‌తో ఎవరినో ఫొటో తీస్తూ, నవ్వుతూ ఏదో చెప్తుంటే, అతను ఫొటో తీస్తున్న వైపు చూస్తూ తారక్ కూడా నవ్వుతున్నాడు. ఆ ఫొటోను షేర్ చేసిన మేకర్స్, "A delightful snap of our Mass Ka Masters Chilling in between the song shoot !!" అంటూ దానికి కాప్షన్ జోడించారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు "నాటు నాటు" అంటే సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇద్దరు కథానాయకులూ ఆ మాస్ సాంగ్‌లో కలిసి డాన్స్ చేశారు. హిందీలో ఈ పాట "నాచో నాచో" అంటూ వస్తుంది. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన తెలుగు పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
2022 జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ పాన్ ఇండియా మూవీలో అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రకని, అలీసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ప్రధాన పాత్రధారులు. వి. విజయేంద్రప్రసాద్ కథ అందించగా, కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.
![]() |
![]() |