![]() |
![]() |

అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'పుష్ప' మూవీలో యాంకర్ అనసూయ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో ఆమె 'దాక్షాయణి' అనే పవర్‌ఫుల్ వుమన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అనసూయ లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, "She is arrogance and pride personified! Introducing @anusuyakhasba as #Dakshayani.." అంటూ ట్వీట్ చేశారు.
నిర్మాతలు షేర్ చేసిన పోస్టర్‌లో అనసూయ ఇప్పటిదాకా స్క్రీన్‌పై కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన స్త్రీ అని ఆమె వేషధారణ బట్టి తెలుస్తోంది. నోట్లో కిళ్లీ నములుతున్నట్లు ఉన్న ఆమె చేతిలో కట్టర్ ఉంది. తలకు విగ్గు ఉంది. పట్టు దుస్తులు ధరించిన ఆమె మెడకు నిండుగా ఆభరణాలు, చేతులకు కడియాల సైజులో బంగారు గాజులు వేసుకుంది. బొటనవేళ్లు మినహాయించి, మిగతా అన్ని వేళ్లకూ ఉంగరాలున్నాయి. లుక్ చూస్తుంటే నెగటివ్ రోల్‌గా అర్థమవుతోంది.
ఇంతకు ముందు రిలీజ్ చేసిన సునీల్ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతదాకా కమెడియన్‌గా చూసిన సునీల్‌ను ఈ సినిమాలో రాక్షసుడిగా చూడబోతున్నామని యూనిట్ తెలియజేసింది. ఇప్పుడు అనసూయ లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆమె లుక్ బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది.

'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప'పై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్‌గా జాతీయ అవార్డు గ్రహిత, మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.
బన్నీ సరసన నాయికగా రష్మిక మందన్న నటిస్తోన్న ఈ మూవీలో ధనుంజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రధారులు. మిరొస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తోన్న ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్‌గా పనిచేస్తుండటం విశేషం.
![]() |
![]() |