![]() |
![]() |

విశాల్, ఆర్య ప్రధాన పాత్రలు పోషించిన 'ఎనిమీ' మూవీ దీపావళి పర్వదినం సందర్భంగా నవంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. రజనీకాంత్ టైటిల్ రోల్ పోషించిన 'అణ్ణాత్త' (పెద్దన్న) కూడా అదే రోజు విడుదలైనప్పటికీ, తమిళనాట మంచి వసూళ్లనే రాబడుతోంది. కాగా, ఒక థియేటర్‌లో జరిగిన సంఘటన ఆడియెన్స్‌ను షాక్‌కు గురిచేసింది. సేలమ్‌లోని ఓ థియేటర్‌లో ఎనిమీ సినిమాను చూసిన వారంతా అయోమయానికి గురయ్యారు. ఎందుకంటే అక్కడ ముందుగా ఆ సినిమా సెకండాఫ్‌ను ప్రదర్శించి, క్లైమాక్స్ కూడా అయిపోయాక, అప్పుడు ఫస్టాఫ్‌ను ప్రదర్శించారు.
అంటే మిగతా థియేటర్లలోని ప్రేక్షకులు ఒక సినిమాను చూస్తే, ఆ థియేటర్‌లోని ప్రేక్షకులు మాత్రం 'ఎనిమీ' కొత్త వెర్షన్‌ను తిలకించారన్న మాట! దీంతో షాక్‌కు గురైన ఫ్యాన్స్, ఆ తర్వాత ఆ థియేటర్ ఓనర్స్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన చెందిన ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులను రప్పించింది. థియేటర్ దగ్గర ఫ్యాన్స్ గొడవకు దిగిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
సూర్య, రాజీవ్ అనే ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ పెద్దయ్యాక ఎలా శత్రువులుగా మారి, ఒకరితో ఒకరు తలపడ్డారనే కథతో ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ 'ఎనిమీ'. ఆ పాత్రలను విశాల్, ఆర్య పోషించారు. ప్రకాశ్‌రాజ్, మృణాళినీ రవి, మమతా మోహన్‌దాస్, తంబి రామయ్య కీలక పాత్రలు చేశారు.

![]() |
![]() |