![]() |
![]() |

తనకు ఇటీవల బ్రేకప్ అయ్యిందని, ప్రస్తుతం తాను ఆ బాధలోనే ఉన్నానని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన సోదరుడు ఆనంద్ హీరోగా నటించిన 'పుష్పక విమానం' సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దేవరకొండ సోదరులు మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు.
తాజాగా దేవరకొండ సోదరులు సరదా చాట్ లో పాల్గొన్నారు. 'పుష్పక విమానం' సినిమాతో పాటు దేవరకొండ సోదరుల గురించి గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానం ఇచ్చారు. అందులో "విజయ్ సింగిలా?.. విజయ్ ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నాడా?" అన్న ప్రశ్నకు విజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. "ఇటీవలే నా హార్ట్ బ్రేక్ అయ్యింది. ఇప్పటివరకూ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. కొంచెం బాధలో ఉన్నా" అని విజయ్ చెప్పుకొచ్చాడు. విజయ్ ఇచ్చిన ఆన్సర్ తో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిజంగానే విజయ్ కి బ్రేకప్ అయ్యి బాధలో ఉన్నాడా లేక సరదాగా చెప్పాడా అన్న చర్చలు మొదలయ్యాయి. ఆనంద్ దేవరకొండ సింగిలా? అంటూ అదే ప్రశ్న ఆనంద్ కు ఎదురవ్వగా "నాకు కూడా తెలీదు" అంటూ సరదా ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నాడు.
గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన కొన్ని ప్రశ్నలకు విజయ్ సమాధానాలు:
'పుష్పక విమానం' ఏ జోనర్ సినిమా?
విజయ్: 'పుష్పక విమానం' సినిమాలో ఎక్కువగా కామెడీ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ చిత్రాన్ని కామెడీ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు.
ఇది ఒరిజినలా? రీమేక్ చిత్రమా?
విజయ్: రీమేక్ కాదు. ఒరిజినల్ కథనే. సినిమా విడుదలయ్యాక మిగిలిన భాషల్లో రీమేక్ అయ్యే అవకాశం ఉంటుంది.
విజయ్ కి ఇష్టమైన నటులు
విజయ్: రణ్‌బీర్ కపూర్, మహేష్ బాబు
విజయ్ కి హిందీ వచ్చా?
విజయ్: ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను. 'లైగర్'లో హిందీ డబ్బింగ్ నేనే చెప్పుకొంటున్నాను.
![]() |
![]() |