![]() |
![]() |

'బాహుబలి' తర్వాత టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. భారీ సినిమాలు తీయడానికి నిర్మాతలు అసలు వెనకాడటం లేదు. నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ లో తెరకెక్కుతుండగా.. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
భారత, ఫ్రెంచ్ భాగస్వామ్యంతో తమ బ్యానర్ లో మొదటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేయబోతున్నట్లు తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమాకి 'తామర' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.

'తామర' టైటిల్ లోగోతో కూడిన ప్రీలుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు మేకర్స్. టైటిల్, పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇదొక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. మరి ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ ని రంగంలోకి దింపుతారో చూడాలి. బాలీవుడ్ భామతో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
![]() |
![]() |