![]() |
![]() |

అవకాశాల పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని అఘాయిత్యానికి పాల్పడిన కేసులో టిక్ టాక్ స్టార్ భార్గవ్ కి షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కోర్టు అతని బెయిల్ ని రద్దు చేసింది. దీంతో అతను మరోసారి జైలు పాలయ్యాడు.
యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన భార్గవ్ తనకి వచ్చిన క్రేజ్ ని అడ్డు పెట్టుకుని.. అవకాశాల పేరుతో 14 ఏళ్ల బాలికని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫోక్సో చట్టం కిందకేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఏప్రిల్ 18 న భార్గవ్ ని అరెస్ట్ చేశారు. జూన్ 15 న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే అతను నిబంధనలను ఉల్లంఘించడంతో తాజాగా కోర్టు అతని బెయిల్ ని రద్దు చేసింది.
బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ భార్గవ్ పై మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమో లో పొందుపరిచారు పోలీసులు. దీంతో బెయిల్ రద్దు చేసిన పోక్సో కోర్టు ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది. రిమాండ్ లో భాగంగా భార్గవ్ ను సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.
![]() |
![]() |