![]() |
![]() |

సంధ్యారాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'నాట్యం'. నిశ్రింకళ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకులముందుకు వచ్చింది. 'నాట్యం' మూవీ టీమ్ చేసిన ప్రయత్నానికి ప్రశంసలు దక్కాయి. అయితే తాజాగా ఈ సినిమాకి మరో అరుదైన గౌరవం దక్కింది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) 2021వ చిత్రోత్సవంలో 'నాట్యం' సినిమా ఎంపికైంది. ఇండియన్ పనోరమా సెక్షన్ లో దేశంలోని వివిధ భాషల నుంచి 221 సినిమాలను పరిశీలించిన జ్యూరీ ఫైనల్ గా 25 ఫీచర్ ఫిల్మ్స్ ని ఎంపిక చేసింది. ఆ 25 లో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక సినిమా 'నాట్యం' కావడం విశేషం. 25 సినిమాలలో బెంగాలీ, మరాఠీ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైన తమిళ సినిమా 'కూజాంగల్' కూడా ఈ లిస్టులో ఉంది.
నవంబర్ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది. ఇందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ని ప్రదర్శించనున్నారు.
![]() |
![]() |