![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం ఎందరినో కలిచి వేసింది. దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు పునీత్ మంచి మనసును, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఒక యువకుడు మాత్రం పునీత్ మరణం కారణంగా బెంగళూరులో మద్యం బ్యాన్ చేశారని ఊగిపోతూ పునీత్ సమాధిపై దారుణ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతను కటకటాల పాలయ్యాడు.
పునీత్ మృతి నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరులో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు బ్యాన్ చేశారు. దీంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు రెచ్చిపోయాడు. చేతిలో మద్యం బాటిల్ పట్టుకొని దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. "రేపటి నుంచి మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. మద్యం తాగి పునీత్ సమాధి దగ్గర .... పోస్తా" అంటూ నీచంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఆ యువకుడిని అరెస్ట్ చేసి, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా బుద్ధి వచ్చేలా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. సైబర్ టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది అని పేర్కొన్నారు.
![]() |
![]() |