![]() |
![]() |

టాలెంటెడ్ యాక్టర్లు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రధారులుగా డైరెక్టర్ సుధీర్ వర్మ ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నాడు. ఈ మూవీకి 'శాకిని డాకిని' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబర్ 2 నివేదా థామస్ బర్త్‌డే. ఈ సందర్భంగా టైటిల్ లోగో పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది నివేదా. దానికి "ఓహో! ఒచ్చేసినాం!! శాకిని డాకిని! కరక్టే!! ఇగ ఇచ్చిపడేసుడే" అనే కాప్షన్ పెట్టింది.
నిజానికి మంగళవారం రాత్రి 9.09 గంటలకు టైటిల్‌ను అనౌన్స్ చేయాల్సి ఉండగా, దానికి ఒక గంట ముందుగానే నివేదా అనౌన్స్ చేసేసింది. ఈ విషయాన్ని రెజీనా చెప్పింది. "ఎప్పట్లానే నివేదా అందరికీ సరైన టైమ్‌లో చెప్పడానికి వెయిట్ చెయ్యలేకపోయింది. 9:09 గంటలు.. ఆ ప్రాంతంలో కదూ చెప్పాల్సింది." అని ట్వీట్ చేసింది.

'శాకిని డాకిని' మూవీని గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌తో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మిక్కీ మెక్‌క్లియరీ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ మూవీకి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను అక్షయ్ పూళ్ల సమకూర్చగా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 'రణరంగం' లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇదే.
![]() |
![]() |