![]() |
![]() |

హీరోగా నిలదొక్కుకోవడానికి పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తోన్న కార్తికేయ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'రాజా విక్రమార్క'. ఈరోజు నిర్మాతలు ఆ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందిందని ట్రైలర్ తెలియజేసింది. ఎంటర్టైన్మెంట్ కూడా తగిన మోతాదులో ఉన్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ ప్రకారం ఈ మూవీలో కార్తికేయ రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు.
ఒక షేడ్‌లో జోవియల్‌గా కనిపించిన అతను, ఇంకో షేడ్‌లో స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా సీరియస్‌గా గన్ ఫైట్లు చేస్తూ కనిపించాడు. అతను హోమ్ మినిస్టర్‌ను కూతుర్ని లవ్ చేస్తాడు. ఆ మినిస్టర్‌తో మాట్లాడమని తన అంకుల్ తనికెళ్ల భరణిని అడుగుతాడు. భరణి ఓ కీలక పాత్ర చేశారు. ఆయనకూ, కార్తికేయకూ మధ్య వచ్చే సన్నివేశాలు, వారి మధ్య నడిచే డైలాగ్స్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తున్నాయి. తను ప్రేమించిన అమ్మాయి కిడ్నాప్ అయితే ఆమెను రక్షించుకోడానికి కార్తికేయ ఏం చేశాడనేది ఆసక్తికరం.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో సుధాకర్ కొమాకుల మరో క్రూషియల్ రోల్ పోషించాడు. కొన్ని సందర్భాల్లో కార్తికేయకు బాగా సన్నిహితునిగా అతను కనిపించాడు. ఒక సీన్లో అతనికే గన్ను కార్తికేయ గురిపెట్టడం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. హీరోయిన్గా తాన్యా రామచంద్రన్ టాలీవుడ్‌కు పరిచమవుతోంది. హోమ్ మినిస్టర్‌గా సాయికుమార్ కనిపించగా, జైలు ఖైదీగా పశుపతి కనిపించాడు. విలన్ అతనా, మరొకరా? అనేది చూడాల్సి ఉంది.
ఈ సినిమాను శ్రీ సారిపల్లి అనే నూతన దర్శకుడు రూపొందించాడు. విజువల్‌గా రిచ్‌గా కనిపిస్తున్న 'రాజా విక్రమార్క'కు పి.సి. మౌళి ఛాయాగ్రహణం ఎస్సెట్. ప్రశాంత్ విహారి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. నవంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
![]() |
![]() |