![]() |
![]() |

నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన మూవీ 'వరుడు కావలెను'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. శుక్రవారం (అక్టోబర్ 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సినిమాకు మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ చిత్ర బృందం మౌనం పాటించింది.
సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. "వరుడు కావలెను సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మొదటి నుంచీ బలంగా నమ్మాను. ఇవాళ మా నమ్మకం నిజమైంది. 'వరుడు కావలెను' చిత్రాన్ని చూసి ఆదరించిన ప్రేక్షకులకు, చూడబోయే ప్రేక్షకులకు కూడా థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో మీకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్లదే కాదు, ఎంతోమంది తెర వెనక పనిచేశారు వాళ్లందరికీ విజయంలో భాగముంది. నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను" అన్నారు.
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ.. "వరుడు కావలెను సినిమాకు మీరు ఇచ్చిన విజయానికి థాంక్స్. మా మూవీ టీమ్ అంతా ఒక మహిళైన నన్ను నమ్మి సపోర్ట్ చేసి సినిమా చేయించారు. అక్కా అని పిలిచే నాగశౌర్య నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. చినబాబు గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం, సితార లాంటి మంచి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా సక్సెస్ చేసి మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నా అని అనుకుంటున్నాను. మేము కథలో అనుకున్న భావోద్వేగాలు స్క్రీన్ మీద పండాయి. సకుటుంబంగా థియేటర్లకు వస్తూ మా చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. అన్ని వయసుల ఆడియెన్స్ హాయిగా చూసే సినిమా అని చెబుతున్నారు. ఇదే కాదు భవిష్యత్ లో నేను చేయబోయే సినిమాలు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా ఉంటాయి" అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ... "వరుడు కావలెను తో ఒక క్లీన్ మూవీ చేశాం. థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా బాగుందనే మౌత్ టాక్ తో ప్రతి షో కు థియేటర్ లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఒక కొత్త డైరక్టర్ ని తీసుకొచ్చి మా సంస్థకు హిట్ ఇచ్చినందుకు హీరో నాగశౌర్యకు థాంక్స్ చెబుతున్నా. మా సంస్థలో మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకొస్తాం" అన్నారు.
![]() |
![]() |