![]() |
![]() |

`సాహో` తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ `సలార్`. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీలో ప్రభాస్ కి జోడీగా `క్రాక్` బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు బ్యాడీగా దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో మూడో షెడ్యూల్ షురూ కానుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ షెడ్యూల్ అంతా నాన్ - స్టాప్ యాక్షన్ తో డిజైన్ చేశారట ప్రశాంత్. అంతేకాదు.. సినిమా కోసం కేటాయించిన బడ్జెట్ లో దాదాపు సగభాగం ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కే కేటాయిస్తున్నట్లు టాక్. అదేవిధంగా.. యాక్షన్ లవర్స్ కి విజువల్స్ ఫీస్ట్ గా ఈ ఘట్టాలు ఉంటాయని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `సలార్`ని `కేజీఎఫ్` ప్రొడక్షన్ హౌస్ హొంబళే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 2022లో ఈ భారీ బడ్జెట్ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |