![]() |
![]() |

`మహా సముద్రం`.. ఈ దసరా సీజన్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా. `ఆర్ ఎక్స్ 100` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో.. సహజంగానే ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు, పాటలు కూడా ఇంప్రెసివ్ గా ఉండడంతో.. అజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. `మహా సముద్రం` ఫలితం నలుగురికి ఎంతో కీలకం కానుంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. ఇందులో మెయిన్ లీడ్స్ గా చేసిన శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్. `శతమానం భవతి` తరువాత సాలిడ్ హిట్ లేని శర్వాకి.. `బొమ్మరిల్లు` అనంతరం బాక్సాఫీస్ హిట్ నోచుకోలేకపోయిన సిద్ధూకి `మహా సముద్రం` సక్సెస్ ఎంతో ముఖ్యం. ఇక `సమ్మోహనం` తరువాత తెలుగునాట సరైన విజయం లేని అదితి రావ్ హైదరీకి.. అలాగే `మజ్ను` తరువాత మరో హిట్ లేని అను ఇమ్మాన్యుయేల్ కి కూడా `మహా సముద్రం` రిజల్ట్ కీలకమే.
మరి.. ఈ నలుగురి కెరీర్ లో మరపురాని చిత్రంగా `మహా సముద్రం` నిలుస్తుందో లేదో తెలియాలంటే అక్టోబర్ 14 వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |