![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. `దిల్` రాజు బేనర్ లో 50వ చిత్రంగా నిర్మితం కానున్న ఈ సినిమా.. చరణ్ కి 15వ చిత్రం కావడం విశేషం. కాగా, ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మరో పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనుందని సమాచారం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. అక్టోబర్ 21 నుంచి పూణెలో `#RC 15` తాలుకు తొలి షెడ్యూల్ ప్రారంభం కానుందట. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి వీలైనంత త్వరగా టాకీ పార్ట్ పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు.. 2023 సంక్రాంతికి `#RC 15`ని థియేటర్స్ లో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వాని నటిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీలో మాలీవుడ్ యాక్టర్ జయరామ్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |