![]() |
![]() |

`బాహుబలి` సిరీస్ తో తెలుగునాట పాన్ - ఇండియా మూవీస్ ట్రెండ్ ఊపందుకుంది. `సాహో`, `సైరా.. నరసింహారెడ్డి` చిత్రాలు ఇదే కోవలో తెరకెక్కి.. వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. దాదాపు రెండేళ్ళ అనంతరం మళ్ళీ ఆ తరహా చిత్రాల సందడి కొనసాగనుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో తెలుగు చిత్ర సీమ నుంచి మూడు పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోకి రానుండడమే ఇందుకు నిదర్శనం.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న రిలీజ్ కానుండగా.. జనవరి 7న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్` విడుదల కానుంది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా `జిల్` రాధాకృష్ణ తీర్చిదిద్దిన పిరియడ్ లవ్ సాగా `రాధే శ్యామ్` తెరపైకి రానుంది.
మరి.. 30 రోజుల్లోపు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న ఈ మూడు డిఫరెంట్ జోనర్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
![]() |
![]() |