![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు నేడు(ఆదివారం) జరుగుతోన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నిలబడ్డారు. ఎప్పుడూ లేని విధంగా మా ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచాయి. నిన్నటి వరకు ఇరు ప్యానల్స్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయ ఎన్నికలను తలపించేలా చేశారు. అయితే నేడు ఎన్నికల సందర్భంగా ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
మా ఎన్నికలకు స్టార్స్ తరలి వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వారు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఇరు ప్యానల్ సభ్యులతో ఫ్రెండ్లీగా ఉండటం కనిపించింది. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్, విష్ణు ల మధ్య ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మోహన్ బాబు, విష్ణులతో ప్రకాష్ రాజ్ సరదాగా ముచ్చటించారు. అంతేకాదు విష్ణు, ప్రకాష్ రాజ్ చేతులను మోహన్ బాబు కలపగా.. విష్ణు, ప్రకాష్ రాజ్ షేక్యాండ్ ఇచ్చుకొని ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
నిన్నటి వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ప్రకాష్ రాజ్, విష్ణులు.. నేడు సరదాగా మాట్లాడుకొని కౌగిలించుకోవడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ఘటన ఎన్నికల వరకే మా గొడవ ఆ తర్వాత తామంతా ఒకటే అని చెప్పినట్లుగా ఉంది.
![]() |
![]() |