![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. 'మా' ఎన్నికలకు స్టార్స్ తరలి వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సుమన్ వంటి వారు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడూ లేని విధంగా 'మా' ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచాయి. ఇరు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయ ఎన్నికలను తలపించేలా చేశారు. ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికలకు ఇంత హడావిడి అవసరం లేదని.. ఇలాంటి పోటీ తానెప్పుడూ చూడలేదని అన్నారు. తిప్పి కొడితే తొమ్మిది వందల ఓట్లు లేవని.. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా? అని ప్రశ్నించారు. 'మా' ఎన్నికల కారణంగా సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని.. పరిశ్రమ పలుదారుల్లో వెళ్లచ్చు కానీ చీలడం అనేది జరగదు అని తేల్చి చెప్పారు.
రాజకీయ ఎన్నికల్లోనే కూర్చుని మాట్లాడుకుంటే చిన్నచిన్న సమస్యలు తొలగిపోతాయి.. ఇక్కడ అది మిస్ అయిందనిపించింది అని పవన్ అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్ బాబు గారు మంచి స్నేహితులు అని.. 'మా' ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని పవన్ క్లారిటీ ఇచ్చారు.
![]() |
![]() |