![]() |
![]() |
.jpg)
చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆచార్య' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. 2022 ఫిబ్రవరి 4న 'ఆచార్య'ను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రామ్‌చరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసి, "2022 ఫిబ్రవరి 4న 'ఆచార్య' వస్తున్నాడు" అని ట్వీట్ చేశాడు. నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, "4 ఫిబ్రవరి 2022న 'ఆచార్య' సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ మొదలవుతుంది" అని ట్వీట్ చేసింది.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న 'ఆచార్య' మూవీలో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్‌చరణ్-పూజా హెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి, చరణ్.. ఇద్దరూ మావోయిస్టులుగా కనిపించనున్నారు. ధర్మస్థలి అనే ప్రాంతం కేంద్రంగా కథ నడుస్తుందని గతంలో రిలీజ్ చేసిన టీజర్ ద్వారా తెలియజేశారు.
మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

![]() |
![]() |