![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచాయి. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నిలవగా.. పలువురు సినీ ప్రముఖులు వారికి మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నాగబాబు, విష్ణు ప్యానల్ కు నరేష్ మద్దతుగా నిలిచి మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష బరిలో నిలుస్తానంటే మొదట స్వాగతించామని నరేష్ తెలిపారు. అయితే 'ఇక్కడ తెలుగువాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వచ్చి పోటీ చేస్తున్నానని' ప్రకాష్ రాజ్ అన్నారు. ఆ మాట తెలుగువారిని అవమానించేలా ఉందని.. తనకు ఆగ్రహం తెప్పించందని అందుకే ఆయన్ని వ్యతిరేస్తున్నాను అని నరేష్ చెప్పుకొచ్చారు. 'మా'లో ఇతర భాషల వాళ్ళు ఉండకూడదని తాను అనట్లేదని.. మిగతా పదవుల్లో ఎవరున్నా పర్లేదు కానీ.. అధ్యక్ష పదవిలో మాత్రం తెలుగు వారుంటే బాగుంటుంది అనేది తన అభిప్రాయమని నరేష్ తెలిపారు.
అయితే ఒకవేళ మా మెంబెర్స్ ప్రకాష్ రాజ్ ను యాక్సెప్ట్ చేసి గెలిపిస్తే.. తానే ముందు వెళ్లి దండ వేస్తానని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు ఒకవేళ ప్రకాష్ రాజ్ గెలిస్తే ఆయనకు మద్దతుగా నిలిచిన నాగబాబుకి తాను సారీ చెప్తానని అన్నారు. అందరం సినిమా వాళ్ళమే కాబట్టి.. ప్రకాష్ రాజ్ గెలిస్తే తన వాదన తప్పని ఒప్పుకొని నాగబాబుకి సారీ చెప్తానని.. ఒకవేళ ప్రకాష్ రాజ్ ఓడిపోతే నాగబాబు తనకి చెప్తారా అని నరేష్ ఛాలెంజ్ చేశారు. మరి దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |