![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో బిజీగా ఉన్నారు. `గీత గోవిందం` వంటి సంచలన చిత్రం తరువాత పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నవంబర్ నెలాఖరులోపు షూటింగ్ పూర్తిచేసుకోనుంది. కాగా, `సర్కారు వారి పాట` చిత్రీకరణ పూర్తి చేసుకోవడమే ఆలస్యం.. మహేశ్ వెంటనే తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`(2005), `ఖలేజా` (2010) చిత్రాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ ముచ్చటగా మూడో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ నెలాఖరు నుంచి ప్రారంభించేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఆపై శరవేగంగా సినిమా పూర్తిచేసి 2022 ద్వితీయార్ధంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని బజ్. మరి.. `SSMB 28`తో మహేశ్ - త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |