![]() |
![]() |

పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకు నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా విడిపోయారు. అయితే, వారు విడిపోవడానికి కారణమేమిటన్నది తెలీదు. అబార్షన్, ఎఫైర్ల రూమర్స్, పిల్లలు వద్దనుకోవడం లాంటివి తాము విడిపోవడానికి కారణం కాదని నిన్న ఓ ప్రకటనటలో తెలిపింది సమంత. ఇప్పుడు, సమంత లేటెస్ట్ ఫిల్మ్ 'శాకుంతలం' ప్రొడ్యూసర్ నీలిమ గుణ ఆమెకు సపోర్ట్‌గా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. నీలిమ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె.
సమంత అబార్షన్ రూమర్స్‌ను ఖండించిన నీలిమ, "గత ఏడాది 'శాకుంతలం' కోసం మా నాన్న గుణశేఖర్ సంప్రదించినప్పుడు, కథను సమంత చాలా ఇష్టపడ్డారు, ఎక్సయిట్ అయ్యారు. అయితే, ఆమె జూలై లేదా ఆగస్ట్ లోగా షూటింగ్ పూర్తి చేయాలని అడిగారు. ఆ తర్వాత నాగచైతన్యతో పిల్లల్ని కని ఫ్యామిలీని స్టార్ట్ చేయాలని ఆమె అనుకున్నారు" అని హైదరాబాద్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీలిమ తెలిపింది.
"ఆమె తల్లి కావాలని కోరుకున్నారు. అది తన ప్రయారిటీ అని మాకు చెప్పారు. పీరియడ్ ఫిలిమ్స్ టైమ్ తీసుకుంటాయి కాబట్టి, మాకు యస్ అని చెప్పడానికి ఆమె నిజంగా వెనుకాడారు. చాలా ప్రిప్రొడక్షన్ వర్క్ చేశాం కాబట్టి, అనుకున్న టైమ్‌కు మూవీని ఫినిష్ చేస్తామని ఆమెకు హామీ ఇచ్చాం. అప్పుడు ఆమె సంతోషంగా ఓకే చెప్పారు. ఆమె ఫ్యామిలీ కావాలని ప్లాన్ చేశారు. బ్రేక్ తీసుకోవాలని, పిల్లల్ని కనాలని ఆమె అనుకున్నారు. ఆమె రిక్వెస్ట్ ప్రకారం మేం షెడ్యూల్స్ మధ్య బ్రేక్ తీసుకోకుండా అనుకున్న టైమ్‌కు సినిమాని పూర్తి చేశాం" అని చెప్పుకొచ్చింది నీలిమ.
ఈనెల 2న తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామనీ, స్నేహితులుగా కొనసాగుతామనీ సమంత, నాగచైతన్య తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించారు.
![]() |
![]() |