![]() |
![]() |
.jpg)
అక్కినేని నాగచైతన్యతో పెళ్లికి ముందు హీరో సిద్ధార్థ్‌తో సమంత రిలేషన్షిప్‌లో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తి వెళ్లి పూజలు చేశారు. పెళ్లి చేసుకుంటారని అందరూ భావించిన సమయంలో విడిపోయారు. తర్వాత నాగచైతన్యతో సమంత పెళ్లి, ఇప్పుడు విడాకులు అందరికీ తెల్సిన విషయాలే. వీళ్లిద్దరి విడాకుల తర్వాత 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు' అని సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. సమంతను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారని జనాలు భావించారు. ఆ విషయం గురించి ప్రశ్నిస్తే... సమంత పేరు చెప్పడానికి కూడా సిద్ధార్థ్ ఇష్టపడలేదు.
సమంతను ఉద్దేశించి తాను ఆ ట్వీట్ చెయ్యలేదనే అర్థం సిద్ధార్థ్ మాటల్లో కనిపించింది. అనూహ్యంగా ఆ ట్వీట్ వేశారని అడిగితే.... "నేను పన్నెండేళ్లుగా ట్వీట్స్ చేస్తున్నా. నేను ఒక రోజు మా ఇంటి బయట కుక్కలు ఎక్కువ అవుతున్నాయని అంటాను. ఎవరో వచ్చి నన్ను కుక్క అంటావా? అని అడిగితే నేనేం చెయ్యాలి. మా ఇంటి బయట కుక్కలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా?" అని సిద్ధార్థ్ ఒకింత కోపంగా చెప్పాడు.
సమంత విడాకులు రోజున చేసిన ట్వీట్ గురించి ప్రశ్నిస్తే... ఇంటి బయట కుక్కలను ఉదహరిస్తూ వివరణ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ రోజు సమంత విడాకులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించగా "నా లైఫ్ గురించి నేను మాట్లాడతాను. సంబంధం లేకుండా మీరు వెళ్లి ఏదైనా చేస్తే అది మీ ప్రాబ్లమ్. నాకు, దానికి సంబంధం లేదు. నేను నా టీచర్ దగ్గర నేర్చుకున్న విషయం చెప్పాను. ఎందుకంటే... 'మహాసముద్రం'లో కూడా ఆ టాపిక్ ఉంది. అనవసరమైన పేర్లు వద్దు" అని సిద్ధార్థ్ చెప్పారు.
![]() |
![]() |