![]() |
![]() |

జట్టుకట్టిన మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ కొట్టిన కొన్ని టాలీవుడ్ జంటలు.. అతి త్వరలో రెండోసారి మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ జోడీలెవరంటే..
చిరంజీవి - కాజల్ః
`ఖైదీ నంబర్ 150` కోసం మెగాస్టార్ చిరంజీవి - టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మొదటిసారి జోడీగా నటించారు. ఆ సినిమాతో ఘనవిజయం అందుకున్న ఈ జంట.. త్వరలో `ఆచార్య`తో మరోసారి
ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది.
వెంకటేశ్ - తమన్నా, వరుణ్ - మెహరీన్ః
హిలేరియస్ ఎంటర్టైనర్ `ఎఫ్ 2` కోసం విక్టరీ వెంకటేశ్ - మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ టైమ్ పెయిర్ అప్ అయ్యారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తయారవుతోంది. `ఎఫ్ 3` పేరుతో
రూపొందుతున్న ఈ చిత్రంలోనూ వెంకీ, తమన్నా మరోసారి జోడీగా కనువిందు చేయనున్నారు. ఇక `ఎఫ్ 2`లో మరో జంటగా నటించిన మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ - మెహరీన్ కూడా `ఎఫ్ 3`లో కలిసి వినోదాలు పంచనున్నారు.
మహేశ్ - పూజా హెగ్డేః
బ్లాక్ బస్టర్ మూవీ `మహర్షి`లో జంటగా అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు - `బుట్టబొమ్మ` పూజా హెగ్డే.. త్వరలో పట్టాలెక్కనున్న త్రివిక్రమ్ డైరెక్టోరియల్ కోసం సెకండ్ టైమ్ జోడీకడుతున్నారు. వచ్చే
ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
నాని - సాయిపల్లవిః
2017 క్రిస్మస్ సెన్సేషన్ `ఎంసీఏ`లో ``ఏవండోయ్ నాని గారూ.. ఏవండోయ్ చిన్ని గారూ`` అంటూ తమ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేసిన నేచురల్ స్టార్ నాని - డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి.. పిరియడ్ డ్రామా
`శ్యామ్ సింగ రాయ్` కోసం మరోమారు జట్టుకట్టారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది.
నాగచైతన్య - రాశీ ఖన్నాః
`వెంకిమామ` చిత్రంలో జంటగా అలరించి తమ ఖాతాలో ఓ హిట్ వేసుకున్న యువ సామ్రాట్ నాగచైతన్య - స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా.. `థాంక్ యూ` కోసం మరోసారి జోడీకట్టారు. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది.
![]() |
![]() |