![]() |
![]() |

టాలీవుడ్ లో పలువురు టాప్ స్టార్స్.. త్వరలో `ఫ్రెష్` పెయిర్స్ తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏ స్టార్ ఏయే హీరోయిన్స్ తో రాబోతున్నారంటే..
బాలకృష్ణ - ప్రగ్యా జైశ్వాల్ః
నటసింహ నందమూరి బాలకృష్ణ త్వరలో `అఖండ`గా పలకరించబోతున్నారు. ఈ చిత్రం కోసం ప్రగ్యా జైశ్వాల్ తో తొలిసారిగా రొమాన్స్ చేస్తున్నారాయన.
పవన్ - నిత్య, నిధిః
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `భీమ్లా నాయక్`, `హరిహర వీరమల్లు` సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ `ఫ్రెష్` కాంబినేషన్స్ తోనే సందడి చేయనున్నారు. `భీమ్లా నాయక్`లో నిత్యా మీనన్ తో తొలిసారిగా జట్టుకట్టిన పవన్.. `హరిహర వీరమల్లు`లో నిధి అగర్వాల్ తో మొదటిసారిగా రొమాన్స్ చేస్తున్నారు. అలాగే ఇందులో జాక్వలైన్ ఫెర్నాండెజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోందని టాక్. ఆమెతోనూ పవన్ కిది ఫస్ట్ కాంబినేషనే. ఇక హరీశ్ శంకర్ డైరెక్టోరియల్ `భవదీయుడు..! భగత్ సింగ్`లో పూజా హెగ్డే, ప్రియమణితో రొమాన్స్ చేయబోతున్నారని బజ్. వారిద్దరితోనూ పవన్ నటించనుండడం ఇదే మొదటి సారి.
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ః
2022 సంక్రాంతికి సంబరాలు పంచనున్న `సర్కారు వారి పాట`లో కేరళకుట్టి కీర్తి సురేశ్ తో ఫస్ట్ టైమ్ రొమాన్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.
ప్రభాస్ - పూజ, కృతి, శ్రుతి, దీపికః
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు పాన్ - ఇండియా మూవీస్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇంతవరకు తను రొమాన్స్ చేయని నాయికలతోనే సందడి చేయనున్నారాయన. `రాధేశ్యామ్`లో పూజా హెగ్డే, `సలార్`లో శ్రుతి హాసన్, `ఆదిపురుష్`లో కృతి సనన్, `ప్రాజెక్ట్ కె`లో దీపికా పదుకోణ్.. ఇలా వీరందరితోనూ ఫస్ట్ టైమ్ జోడీకట్టారు ప్రభాస్.
తారక్ - ఓలివియాః
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్`లో విదేశీ సోయగం ఓలివియా మోరిస్ తో జతకట్టారు. ఇక కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ `ఫ్రెష్` పెయిర్ తోనే ఆయన నటించే అవకాశముందంటున్నారు.
చరణ్ - పూజ, ఆలియాః
`ఆర్ ఆర్ ఆర్`లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తోనూ.. `ఆచార్య`లో పూజా హెగ్డేతోనూ ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూజ ఇప్పటికే `రంగస్థలం`లో చరణ్ తో ఓ ప్రత్యేక గీతంలో సందడి చేసినా.. నాయికగా ఇదే తొలిసారి. కాగా, శంకర్ సినిమా కోసం మాత్రం కియారా అద్వానితో సెకండ్ టైమ్ ఆడిపాడనున్నారు చరణ్.
బన్నీ - రష్మికః
తన తొలి పాన్ - ఇండియా మూవీ `పుష్ప` కోసం నేషనల్ క్రష్ రష్మికా మందన్నతో జోడీకట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
రవితేజ - మీనాక్షి, డింపుల్, రాజీషా, దివ్యాంశః
మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోయే రెండు చిత్రాల్లోనూ `ఫ్రెష్` కాంబినేషన్స్ నే. `ఖిలాడి`లో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటించగా.. ఇక `రామారావు ఆన్ డ్యూటీ`లో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ నాయికలుగా దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |