![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఊహించినట్లుగానే నేడు(అక్టోబర్ 7న) ప్రభాస్ హీరోగా నటిస్తున్న 25 వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనుండటం విశేషం.
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తన 25 వ సినిమాను ఏ దర్శకుడితో చేస్తాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ 25 వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్.. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించారు. దీంతో బడా బడా స్టార్స్ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఒకానొక టైంలో ఆయన మహేష్ బాబుతో సినిమా చేయనున్నారని కూడా టాక్ వచ్చింది. అయితే అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా సూపర్ హిట్ అందుకున్న సందీప్.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ 25 వ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
మొదటి సినిమాతోనే సంచలన విజయం సాధించి నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీస్తున్న 'స్పిరిట్'తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
![]() |
![]() |