![]() |
![]() |

వైష్ణవ్‌తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'కొండపొలం' చిత్రం అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో తన హీరో వైష్ణవ్‌ను పొగడ్తలతో ముంచెత్తింది రకుల్. "అందరూ చెబుతున్నట్లే ఒకనాటికి వైష్ణవ్ చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఇప్పటికే అతను తనదైన మార్గంలో ఉన్నాడు. నేర్చుకోవాలనే తపన ఉన్న అతికొద్దిమంది నటుల్లో వైష్ణవ్ ఒకడు. అతని కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా వినయంగా కనిపిస్తాడు. చాలా స్వీట్ బాయ్" అంటూ చెప్పుకొచ్చింది రకుల్.
మూవీలో తను ఓబులమ్మ అనే ఛాలెంజింగ్ రోల్ చేశానని ఆమె తెలిపింది. "ప్రతి యాక్టర్‌కీ వాళ్ల కెరీర్‌లో ఎలాంటి ఫిల్మ్ కావాలని కోరుకుంటారో, ఎలాంటి సినిమా చేస్తే గర్వంగా ఫీలవుతారో అలాంటి సినిమా 'కొండపొలం'. సౌకర్యంగా ఉండే జోన్ నుంచి బయటకు వచ్చి నేను చేసిన క్యారెక్టర్ ఓబులమ్మ. రియల్ లైఫ్ పర్సనాలిటీని వదిలేసి, ఒక డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ రోల్ ఇచ్చే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. వాళ్లు మీ మీద నమ్మకం పెడతారు. నేను చేయగలనని నమ్మి నాకు ఓబులమ్మ పాత్రను ఇచ్చిన క్రిష్‌కు థాంక్స్. ఆ పాత్రలా నేనుండను. అది నాకు ఛాలెంజ్." అని చెప్పింది రకుల్.
"ఓబులమ్మ క్యారెక్టర్ చేయడం నా కెరీర్‌లోని మోస్ట్ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్సెస్‌లలో ఒకటి. అది ఒక సోల్‌ఫుల్ క్యారెక్టర్. నాకు ఒక శాటిస్‌ఫ్యాక్షన్ వచ్చింది. దాన్ని నేను మాటల్లో వ్యక్తం చేయలేను. ఆ క్యారెక్టర్ చేశాక ఒక సంపూర్ణత సాధించిన ఫీలింగ్ కలిగింది. ఆ పాత్ర చేస్తుంటే నాకెంత సంతోషం కలిగిందో, అంతగా ఆడియెన్స్‌కు నచ్చుతుందని నమ్ముతున్నా" అని రకుల్ తెలిపింది.
ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చిన 'కొండపొలం' పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల ఆదరణ పొందాయి. ట్రైలర్‌తో వచ్చిన హైప్‌తో 'కొండపొలం'కు మంచి వసూళ్లు లభిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |