![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తమ్మీద.. ఇప్పటివరకు నాలుగుసార్లు సంక్రాంతి సీజన్ లో సందడి చేశారు. `సుస్వాగతం`(1998), `బాలు` (2005), `గోపాల గోపాల` (2015), `అజ్ఞాతవాసి` (2018) చిత్రాలతో ముగ్గుల పండగ సమయంలో వినోదాలు పంచారు పవన్. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరో సినిమాతో ఈ సీజన్ లో పలకరించబోతున్నారు పవన్. ఆ చిత్రమే.. `భీమ్లా నాయక్`. 2022 సంక్రాంతి సీజన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పొంగల్ సీజన్ లో పవన్ కిది మూడో రీమేక్. తమిళ చిత్రం `లవ్ టుడే` (1997)కి రీమేక్ గా రూపొందిన `సుస్వాగతం` 1998 జనవరి ప్రథమార్ధంలో సంక్రాంతి కానుకగా
విడుదలై పవన్ కి తొలి సూపర్ హిట్ ని అందించగా.. హిందీ చిత్రం `ఓ మై గాడ్`(2012)కి రీమేక్ గా తయారైన `గోపాల గోపాల` కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ క్రమంలోనే.. మాలీవుడ్ బ్లాక్
బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` (2020)కి రీమేక్ గా రూపొందుతున్న `భీమ్లా నాయక్`తోనూ విజయం అందుకుని పవన్ సంక్రాంతి సీజన్ లో రీమేక్ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
కాగా, సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న `భీమ్లా నాయక్`.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |