![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ కథానాయకుడిగా నటించిన నాలుగో చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా దర్శనమివ్వనున్న ఈ సినిమాకి `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వం వహించాడు. విజయదశమి కానుకగా అక్టోబర్ 15న ఈ రొమాంటిక్ డ్రామా థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`కి మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరాలు సమాకూర్చిన సంగతి తెలిసిందే. అఖిల్ తో తనకిదే మొదటి సినిమా కావడం విశేషం. అంతేకాదు.. ఎప్పటిలాగే తన శైలిలో మంచి మెలోడీలను అందించారు గోపీ. ప్రస్తావించదగ్గ విషయం ఏంటంటే.. గతంలో కింగ్ నాగార్జున కాంబినేషన్ లో గోపీసుందర్ చేసిన మొదటి సినిమా `ఊపిరి` (2016), యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో చేసిన తొలి చిత్రం `ప్రేమమ్` (2016) మంచి ఫలితాలనే అందుకున్నాయి. మరి.. తన తండ్రి, అన్నయ్యకి తొలి కాంబినేషన్ పరంగా అచ్చొచ్చిన గోపీసుందర్ ఫ్యాక్టర్.. అఖిల్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |