Home  »  News  »  నిర్మాత‌ల‌ను, ద‌ర్శ‌కుల‌ను ఇబ్బందిపెట్టే ప్ర‌కాశ్‌రాజ్‌ను ఎవ‌రూ ఎన్నుకోరు!

Updated : Oct 5, 2021

 

ప్రకాశ్‌రాజ్‌ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌ ప్రెసిడెంట్‌గా ఎవరూ ఎన్నుకోరని సినీ హీరో మంచు విష్ణు అభిప్రాయ‌ప‌డ్డారు. వాళ్లు చెప్పిన డిస్నిల్యాండ్ అజెండా కన్నా తన అజెండా బెటరని అందరికీ తెలుసునన్నారు. త‌మ‌ ప్రయారిటీలు ఏమిటో ఇప్పటికే చెప్పానని ఆయన తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న 'మా' ఎన్నికలు బాధ్యత ఉన్న వ్యక్తికి.. బాధ్యత లేని వ్యక్తికి మధ్య జరుగుతున్నాయని మంచు విష్ణు చెప్పారు. తెలుగువ‌న్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు తెలిపారు.
 
‘మా’ అధ్యక్షుడిగా నిలబడాలని వచ్చిన ఆలోచన తనది కాదని.. చిత్రసీమలో కొందరు వ్యక్తులు తనను అధ్యక్షుడిగా నిలబడాలని ప్రోత్సహించడమే కాకుండా... ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేస్తామన్నారని... ఆ క్రమంలో తాను ఈ ఎన్నికల బరిలో నిలిచినట్లు మంచు విష్ణు స్పష్టం చేశారు. అయితే మా ఎన్నికల సందర్భంగా కొందరు వ్యక్తులు ఎన్నికల బరిలో నిలబడడం.. విత్ డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలు సాఫీగా జరగాల్సింది.. ఇంత హీటెడ్‌గా.. ఇంత నాన్‌సెన్సికల్‌‌గా జరగడంతో చిత్రసీమలో ఎవరూ హ్యాపీగా లేరన్నారు.

2015, 2016లోనే తనను మా అధ్యక్షుడిగా నిలబడాలని.. అలా చేస్తే... ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రముఖ నటుడు మురళీమోహన్ చెప్పారని... అప్పుడు కూడా చిత్రసీమలో సీనియర్లు ఉన్నారని మంచు విష్ణు గుర్తు చేశారు. అప్పుడు తాను ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నానన్నారు. అయితే వాళ్లకు తనపై నమ్మకం ఏమిటంటే.. నమ్మకంగా ఉంటాను.. బాధ్యతతో ఉంటానని... అలాగే పాత వాళ్లను, యువతరాన్ని కలుపుకుని వెళ్తానని మంచు విష్ణు వెల్లడించారు.

ఒక ఇంట్లోనే కలతలు ఉంటాయని అలాంటింది ‘మా’ది కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అని.. అందులో గొడవలు ఉంటాయన్నారు. బయట నుంచి వచ్చిన వారు.. ఫ్యామిలీని చూసుకుంటానంటే ఎలా ఉంటుంది.. ఎవరికైనా కాలదా అని తెలుగువన్ ప్రతినిథికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్ తెలిపారు.

ప్రకాశ్ రాజ్ గురించి తాను మొత్తం మాట్లాడితే... బాత్‌రూమ్‌లోకి వెళ్లి... లాక్ వేసుకుని.. షవర్ కింద కూర్చుని రోజంతా ఏడుస్తూ ఉంటారన్నారు. తమది క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీ అని మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందనపై మంచు విష్ణు ప్రతిస్పందించారు.

ప్రకాశ్ రాజ్‌లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందన్నారు. అయినా ప్రకాశ్ రాజ్‌కు క్రమశిక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండన్నారు. ప్రకాశ్ రాజ్... నిర్మాతలు, దర్శకులను ఇబ్బంది పెట్టలేదా... అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను సెట్‌లో అమ్మనా బూతులు తిట్టారన్నారు. అందుకు ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల అంశాన్ని ఉదహరించారు మంచు విష్ణు.
 
ప్రకాశ్ రాజ్ వల్ల చాలా మందికీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయన్నారు. ప్రకాశ్ రాజ్‌ను నటుడిగా గౌరవిస్తారని... అంతేకాని వ్యక్తిగా మాత్రం ఎవరూ ఆయనకు గౌరవం ఇవ్వరన్నారు. తానేమిటో ఇక్కడ ఉన్నవారందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. అయితే 'పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు... నీ సినిమా' అంటూ మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు తనదైన శైలిలో స్పందించారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్.. బెంగళూరులో పోటీ చేస్తే.. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి ఆయన ప్రధాని మోదీని దుర్భాషలాడతారన్నారు. ప్రకాశ్ రాజ్ వచ్చేటప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయనట్లున్నారని.. అందుకే ప్రకాశ్ రాజ్ అట్లా మాట్లాడారని మంచు విష్ణు వ్యంగ్యంగా అన్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.