![]() |
![]() |

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నేతలు కొండా మురళి, సురేఖ దంపతుల నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా 'కొండా' అనే సినిమాను ఆర్జీవీ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఆర్జీవీ.. ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.
తన మొదటి సినిమా 'శివ'లో యాదగిరి పాత్ర కోసం తెలంగాణ యాసను ఉపయోగించామని గుర్తు చేసిన ఆర్జీవీ.. 'కొండా' సినిమా అనేది పూర్తిగా తెలంగాణ యాసలో చిత్రీకరించబడిన తన మొట్టమొదటి సినిమా అని చెప్పుకొచ్చారు. 'కొండా' సినిమాలో వైలెన్స్ ఉంటుందని చెప్పిన ఆర్జీవీ.. ఈ మూవీ తెలంగాణ రక్తచరిత్ర అని తెలిపారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ లవ్ స్టొరీ కూడా ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు.

కాగా, 'కొండా' సినిమాలో కొండా మురళి పాత్రలో అదిథ్, కొండా సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో వీరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
![]() |
![]() |