![]() |
![]() |

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ లాక్‌డౌన్‌లో మ్యారేజ్ చేసుకున్నట్టు రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. మాల్దీవ్స్‌కు హనీమూన్ ట్రిప్ వేశారు. అక్కడ స్విమ్‌సూట్‌లో, బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో సండే పోస్ట్ చేశారు. దానిపై ఎక్కువశాతం మంది 'విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నావ్?' అని కామెంట్ చేస్తున్నారట. 'మీకు మ్యారేజ్ అయింది. మరీ ఇలాంటి డ్రస్సులు టూమచ్. పర్సనల్ గా ఉంచుకుంటే బావుంటుంది కానీ ఇలా బాలేదు' అని ఒకరు సలహా ఇచ్చారు. అటువంటి కామెంట్లకు విద్యుల్లేఖ రామన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
"విడాకులు ఎప్పుడు? టైప్ మెసేజ్ లు వస్తున్నాయి. జస్ట్... స్విమ్ సూట్ వేసుకున్నందుకా? వావ్. అంకుల్స్, ఆంటీస్... 1920 నుండి 2021కి బయటకు రండి. నెగెటివ్ కామెంట్స్ ప్రాబ్లమ్ కాదు. ఒక సొసైటీగా మనం ఆలోచిస్తున్నది సమస్య. ఒకవేళ మహిళ దుస్తులే విడాకులకు కారణం అయితే... సరిగా దుస్తులు ధరించనివాళ్ళు సంతోషకరమైన వైవాహిక జీవితంలో ఉండకూడదా? సంజయ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. విమర్శలు వదిలెయ్యమని చెప్పాడు. కానీ, నేను వదల్లేను. కామెంట్లు చేస్తున్నవాళ్ల మైండ్ సెట్ నేను మార్చలేను. కానీ, వాళ్ళ జీవితాల్లో మహిళలు అటువంటి ఆలోచన ధోరణి పట్ల గళం వినిపిస్తారని ఆశిస్తున్నాను" అని విద్యుల్లేఖ రామన్ రాసుకొచ్చారు.

హీరోయిన్లు, ఫిమేల్ ఆరిస్టులు కొందరు పెళ్లైన తర్వాత ఇటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నవారే. అందులో కొంతమంది విమర్శల పట్ల ఇదే విధంగా స్పందించారు.

![]() |
![]() |