![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మల్టిస్టారర్స్ తక్కువే. తను స్టార్ గా ఎదిగాక తన అన్న, మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్ దాదా` సిరీస్ లో అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు పవన్. అయితే, అవి మల్టిస్టారర్స్ గా క్రెడిట్ కావు. ఇక ఆ మధ్య విక్టరీ వెంకటేశ్ తో కలిసి నటించిన `గోపాల గోపాల` (2015) మల్టిస్టారర్ మూవీగా తెరకెక్కగా.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `భీమ్లా నాయక్` కూడా పవన్ కెరీర్ లో ఆ కేటగిరి మూవీనే. ఇందులో వెంకటేశ్ అన్న కుమారుడు దగ్గుబాటి రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు పవన్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ తో పవన్ నటించిన రెండు సినిమాలు కూడా రీమేక్ మూవీస్ నే కావడం విశేషం. హిందీ చిత్రం `ఓ మై గాడ్` ఆధారంగా `గోపాల గోపాల` రూపొందితే.. మలయాళ సినిమా `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా `భీమ్లా నాయక్` తెరకెక్కుతోంది. అంతేకాదు.. `గోపాల గోపాల` సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాగా, `భీమ్లా నాయక్` కూడా అదే బాటలో వెళుతోంది. అదే విధంగా.. `గోపాల గోపాల` ఆ చిత్ర దర్శకుడు కిశోర్ కుమార్ పార్ధసాని (డాలీ)కి మూడో సినిమా కాగా.. `భీమ్లా నాయక్` కూడా సాగర్ కె. చంద్రకి కెప్టెన్ గా మూడో చిత్రమే. మొత్తమ్మీద.. దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ తో పవన్ జట్టుకట్టిన సినిమాలకి చెప్పుకోదగ్గ స్థాయిలో కామన్ కనెక్షన్స్ ఉండడం విశేషమనే చెప్పాలి.
![]() |
![]() |