![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వైపు 'మా' ఎన్నికల పోరు, మరోవైపు ఏపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ కళ్యాణ్ పోరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన నిర్మాత యలమంచి రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని.. అందరూ కరెక్ట్ గా వుండి ఐకమత్యంగా కలసి వుంటే ఇండస్ట్రీకి మంచిదని అన్నారు. పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడిని అందరూ నిర్మాతలు ఖండించారు అని నట్టి కుమార్ చెప్పాడు. మా అందరి తరుపున చెప్పడానికి అతను ఎవరు?.. ఇండస్ట్రీకి సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఇండస్ట్రీకి అంటించవద్దు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చెయ్యాలి కాని డిమాండ్ చెయ్యకూడదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఆయనకు ఎవ్వరూ విషెస్ చెప్పలేదు.. ఇప్పుడు మీకు అవసరం వచ్చింది కాబట్టి వెళ్లి కలిశారు అని ఎద్దేవా చేశారు. దయచేసి సినీ పరిశ్రమను కాపాడండి.. మాకున్న సమస్యలను పరిష్కరించండి అని ఏపి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అన్నారు. ఎవరిని అయినా ఏదైనా సమస్య ఉంటే అడిగే విధానం బావుండాలి.. అలా కాకుండా ఏరా సన్నాసి ఇది చెయ్యి అంటే చేస్తారా అని ప్రశ్నించారు. కొంత మంది చేసిన వ్యాక్యలు ఏపి ప్రభుత్వాన్ని హార్ట్ చేసి వుంటే క్షమించి సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చెయ్యండి, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలి అని నా మనవి అని కోరారు.
మా ఎన్నికలు.. నిలబడే మెంబెర్స్ కి తప్పితే ఎవరికి లాభం లేదు. దానికి ఇంత రచ్చ అవసరమా? అని ప్రశ్నించారు. అంతేకాదు మా అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి.. మా కూడా సస్పెండ్ చేసింది.. అలాగే షూటింగ్ కి టైమ్ కి రాడు అని తనని సస్పెండ్ చేస్తే, మీరు ఏమి పీక్కుంటారో పీక్కోండి అన్న వ్యక్తి.. ఆ మాటలు మీరు ఎలా మరిచి పోయి మద్దతు ఇస్తారు అని రవిచంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు మోహన్ బాబు గారు ఫ్యామిలీ ఇండస్ట్రీ కోసం, మా కోసం ఎంతో కొంత వాళ్ళు సేవ చేసారు అందువల్ల వారికి మద్దతు తెలపటం లో ఎలాంటి సందేహం లేదు అన్నారు.
![]() |
![]() |