![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పటివరకు 12 చిత్రాలు వెండితెరపై వినోదాన్ని పంచాయి. అయితే, ఈ సినిమాల్లో చరణ్ సరసన రిపీట్ అయిన నాయికలు మాత్రం ఇద్దరే. వారిలో ఒకరు కాజల్ అగర్వాల్ కాగా, మరొకరు రకుల్ ప్రీత్ సింగ్. `మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్ కోసం తొలిసారిగా జట్టుకట్టిన చరణ్ - కాజల్.. ఆపై `నాయక్` (2013), `గోవిందుడు అందరి వాడేలే` (2014)లో జోడీగా మెస్మరైజ్ చేశారు. అలాగే `ఎవడు` (2014)లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక రకుల్ విషయానికి వస్తే.. చరణ్ తో తొలిసారిగా నటించిన `బ్రూస్ లీ` (2015) బోల్తా పడినా.. `ధృవ` (2016) రూపంలో సెకండ్ టైమ్ జట్టుకట్టే ఛాన్స్ దక్కింది. రెండోసారి ఈ ఇద్దరి జోడీ సక్సెస్ ని సొంతం చేసుకుంది.
కట్ చేస్తే.. రకుల్ తరహాలోనే తనకు ఫస్ట్ టైమ్ అంతగా కలిసి రాని మరో హీరోయిన్ తో రెండోసారి కలిసి నటిస్తున్నారు రామ్ చరణ్. ఆ నాయిక మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. 'వినయ విధేయ రామ'(2019) కోసం తొలిసారిగా జంటగా నటించిన చరణ్, కియారాకి.. ఆ సినిమాతో చేదు అనుభవమే మిగిలింది. అయినప్పటికీ తమ జోడీ కనువిందు చేయడంతో.. ఇప్పుడు శంకర్ డైరెక్టోరియల్ కోసం సెకండ్ టైమ్ పెయిర్ అప్ అయ్యారు. మరి.. రకుల్ తరహాలో కియారా కూడా చరణ్ కాంబోలో రెండో సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |