![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
భారీ తారాగణంతో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదల తేదీ పలు కారణాల చేత మారుతూ వచ్చింది. ఈ ఏడాది దసరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని మూవీ టీమ్ కొద్దిరోజుల క్రితం వరకు చెబుతూ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ విడుదల వాయిదా పడింది. మూవీని దసరాకు విడుదల చేయడం సాధ్యం కాదని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో మూవీ విడుదల ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదీ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' మూవీని విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. అంటే సంక్రాంతికి వారం ముందే ఆర్ఆర్ఆర్ సందడి మొదలు కానుంది అన్నమాట.

కాగా 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, చరణ్ సరసన్ ఆలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
![]() |
![]() |